‘ది ప్యారడైజ్’ చిత్రంలో భారీ మార్పు..?
‘ది ప్యారడైజ్’ చిత్రంలో భారీ మార్పు..?

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్‌గా ‘హిట్-3’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక నాని తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరికొత్త లుక్స్‌తో ప్రేక్షకులను స్టన్ చేయనున్నాడు. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించేందుకు తొలుత జి.కె.విష్ణు ఈ ప్రాజెక్టు లోకి వచ్చారు. అయితే, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో మరో టాప్ సినిమాటోగ్రాఫర్ కోసం చిత్ర యూనిట్ చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించనుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.