థియేటర్లలో మళ్ళీ "అనగనగా"
థియేటర్లలో మళ్ళీ "అనగనగా"

థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమాలు ఓటీటీలోకి రావడం, మరోవైపు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కావడం సాధారణం. కానీ, ముందుగా ఓటీటీలో రిలీజై, ఆ తర్వాత థియేటర్లలో విడుదల కావడం అరుదు. ఈ రెండో జాబితాలోదే ‘అనగనగా’ (Anaganaga). సుమంత్‌, కాజల్‌ చౌదరి, మాస్టర్‌ విహర్ష్‌ ప్రధాన పాత్రల్లో సన్నీ సంజయ్‌ తెరకెక్కించిన సినిమా ఇది. ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకి మంచి స్పందన దక్కింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ చిత్రం థియేటర్లలోకి రానుందని సుమంత్‌ తెలిపారు. నటుడు అడివి శేష్‌ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.