
'ఉప్పు కప్పురంబు' ప్రీమియర్ జూలై 4న విడుదల!
ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన "ఉప్పు కప్పురంబు" చిత్రానికి ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. ప్రముఖ తారలు కీర్తి సురేష్, సుహాస్, బాబు మోహన్, శత్రు మరియు తాళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు
ప్రైమ్ వీడియో తన రాబోయే తెలుగు ఒరిజినల్ మూవీ "ఉప్పు కప్పురంబు"ప్రీమియర్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.
ఈ సినిమాకి వసంత్ మారింగంటి రచన చేశారు. 1990ల నాటి ఈ వ్యంగ్య చిత్రం దక్షిణ భారత దేశంలోని లోతట్టు ప్రాంతంలోని చిట్టి జయపురం అనే కల్పిత గ్రామం లో జరిగే కథ ఆధారంగా నిర్మించ బడింది. ఈ చిత్రాన్ని తెలుగు,తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో డబ్ వర్షన్స్ తో ప్రసారం చేయనున్నారు. చమత్కారం, హాస్యం తో నిండిన ఉప్పు కప్పురంబు ఒక సామాజిక సమస్యపై తీయబడింది.
"జూలై 4 నుండి ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా దేశాలు మరియు ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రీమియర్ అవుతుంది ఈ సినిమా" అని ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ & ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ అన్నారు.
"ఉప్పు కప్పురంబు" అనేది ఆలోచింపజేసే, ఆహ్లాదకరమైన మరియు విచిత్రమైన వ్యంగ్య రూపక చిత్రం, అదే సమయంలో ఒక అసాధారణమైన ఇతివృత్తాన్ని తెరపైకి తెస్తుంది. ఎల్లనార్ ఫిల్మ్స్‌తో కలిసి పనిచేయడం, కీర్తి సురేష్ మరియు సుహాస్ వంటి ప్రతిభావంతులైన తారాగణంతో పాటు ఐ.వి. శశి దర్శకత్వ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం మాకు గర్వకారణం" అని ఆయన అన్నారు.
"ఉప్పు కప్పురంబు చిత్రాన్ని నేను చాలా కాలంగా తెరపైకి తీసుకురావాలని కోరుకుంటున్నా" అని దర్శకుడు ఐ.వి. శశి అన్నారు. 90ల నాటి గ్రామీణ జీవితం యొక్క విచిత్ర అస్తవ్యస్త నేపథ్యానికి వ్యతిరేకంగా తీశాం. ఇది వ్యంగ్యంగా హాస్యాన్ని రంగరించే చిత్రం. సమాజంలోని చాలా తీవ్రమైన సమస్యలను పరిష్కరించే దిశలో ఈ చిత్రం లో కామెడీని అర్థవంతమైన వ్యాఖ్యానంతో ముడి పెట్టడానికి ఒక ప్రయత్నం చేసాం, దీనికి అద్భుతమైన తారాగణం మరియు టీం ప్రాణం పోసారు" అని కూడా ఆయన అన్నారు.