
చిన్న సినిమాతో శశిప్రీతం సరికొత్త రికార్డు !
ఒక చిన్న సినిమా మూడు వారాలు ఆడే కాలమా ఇది? పెద్ద పెద్ద హీరోలవే వారం తరువాత చూద్దామంటే కనిపించడం లేదు! అలాంటిది శశిప్రీతం రికార్డు సృష్టించారు! సంగీత దర్శకుడు.. గాయకుడు.. శశిప్రీతం దర్శకుడుగా మారి తీసిన సినిమా X Roads దిగ్విజయంగా మూడవ వారంలోకి ప్రవేశించింది! టివోలి థియేటర్ లో డంకా బజాయిస్తోంది! అందులో ప్యాడింగ్ యాక్టర్స్ మినహా అంతా యాక్టింగ్ లో మెరుగులు దిద్దుకుంటున్న కుర్రాళ్ళే! లోహిత్, వైభవ్ సూర్య లాంటి సీనియర్ జోష్ ఫేసులు కనిపించినా మిగిలిన వాళ్ళు కొత్తవాళ్లే! కానీ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం విశేషమే! కొంపతీసి వంద రోజులు ఆడేస్తుందా ఏంటి? కరోనా తరువాత ఇంత వరకు శత దినోత్సవం జరుపుకున్న సినిమా లేదు!
సీనియర్ నటుడు లోహిత్ అన్నట్లు ఒక సినిమా విడుదల వెనుక ఎన్నో జీవితాలు కష్టపడి ఉంటాయి! వారి శ్రమను మేధస్సును ఒక్క ముక్క లో బాలేదని చెప్పలేం! చెప్పడం అన్యాయం! ఏ సినిమా అయినా అంతే! X Roads నిర్మాత డైనమిక్ డేరింగ్ ఐశ్వర్య కృష్ణప్రియ! ఆమె ఇంకో మంచి సినిమా తీయడానికి గొప్ప స్ఫూర్తినిచ్చింది X Roads సినిమా!
శశిప్రీతం నా మిత్రుడు అని చెప్పడం కాదు కానీ, గులాబీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి శశిప్రీతం బ్రాండ్ ఒక వైబ్రేషన్! జనరేషన్లు మారినా గులాబీ పాటలు ఇప్పటికి కుర్రకారును వెంటాడుతూ ఉంటాయి! ఆయన ఇచ్చిన ట్యూన్స్ అలాంటివి! ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా అంటే ఇంటిల్లిపాది చూడాల్సిందే! తల్లిదండ్రులు సహకరించి తోడుగా ఉంటే ఒక అమ్మాయికి ఆకాశమే హద్దు అని, ఏదయినా సాధిస్తుంది అని చెప్పడమే ఈ సినిమా! నాకు బాగా నచ్చింది! నేను మళ్ళీ చూశాను! తల్లిదండ్రులతో కలసి యువత చూడాల్సిన సినిమా ఇది! ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి! శశిప్రీతం గారు ఈ విజయంతో మరో మంచి సినిమాకు శ్రీకారం చుట్టండి! అభినందనలు!