విజయ్ జననాయగన్ షూటింగ్ పూర్తి?
విజయ్ జననాయగన్ షూటింగ్ పూర్తి?

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న జననాయగన్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.విజయ్ సినిమాలు సాధారణంగా చాలా స్పీడ్ గా షూట్ చేస్తూ ఉంటారు. కానీ విజయ్ రాజకీయాలతో బిజీగా ఉండడంవల్ల షూటింగ్ కి ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నాడు. మరో ఒకటి రెండు షెడ్యూల్స్ తో సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ను హీరోయిన్ పూజ హెగ్డే ఇచ్చింది. సినిమా లో తన పోర్షన్ పూర్తి చేసినట్లుగా చెప్పుకొచ్చింది. దాంతో పాటు లవ్ ఎమోజీలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తను త్వరలోనే డబ్బింగ్ చెప్తాను అంటూ ఆమె పేర్కొంది.ఈ సినిమా డబ్బింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాపై పూజ హెగ్డే చాలా ఆశలు పెట్టుకుంది.టాలీవుడ్ లో ఆఫర్లు లేని ఈ అమ్మడు లక్కీగా కోలీవుడ్ లో వరుస సినిమాలో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది.