Warning: unlink(/home/u917478803/domains/tfda.in/storage/cache/cache.article.1a9a0da898614034063d24a7e1e90c63.1751385323): No such file or directory in /home/u917478803/domains/tfda.in/public_html/system/library/cache/file.php on line 79 రాష్ట్రపతి నిలయంలో శ్రీజకు గురు సత్కారం!
రాష్ట్రపతి నిలయంలో శ్రీజకు గురు సత్కారం!
రాష్ట్రపతి నిలయంలో శ్రీజకు గురు సత్కారం!

ఫాదర్స్ డే సందర్భంగా ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి నిలయంలో గురు సత్కారం స్వీకరించారు నటి, యాక్టింగ్ ప్రొఫెసర్ శ్రీజ సాదినేని. 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆరేళ్ల వయసు లోనే రంగస్థలంపై అడుగుపెట్టిన తాను తండ్రి కీ.శే. సాదినేని నాగేశ్వర రావు ప్రోత్సాహంతో హరికథ,బుర్రకథ, సంగీతం, నాట్యం వంటి విభాగాలలో ప్రవేశం పొంది, బాలనటిగా నాటకరంగంలో అడుగుపెట్టి అనతికాలం లోనే నటనలో ప్రావీణ్యం
పెంపొందించుకుని నటిగానే కాక రచయిత్రి, దర్శకురాలు, నిర్వాహకురాలు, మేకప్ మరియు సెట్ ఆర్టిస్టుగా అంచెలంచెలుగా ఎదుగుతూ చిన్న వయసు లోనే గురువుగా కూడా మారానన్నారు. రెండు వేలకు పైగా శిష్యులకు శిక్షణ ఇచ్చిన శ్రీజ ఇప్పటి వరకూ తాను అందుకున్న మూడువేలకు పైగా అవార్డుల కంటే రాష్ట్రపతి నిలయంలో స్వీకరించిన గురు సత్కారం తనకు ఎంతో ప్రత్యేకం అని మురిసి పోయారు.ఫాదర్స్ డే సందర్భంగా తాను దర్శకత్వం వహించిన ముప్ఫై నాలుగవ తెలుగు నాటిక "నాన్నకు ప్రేమతో" తన శిష్యులతో ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. తండ్రీ కూతుళ్లుగా నటించిన తన విద్యార్థులు ప్రేక్షకులతో కంట తడి పెట్టించడం గురువుగా తనకు ఆనంద భాష్పాలు తెప్పించిందన్నారు. ఈ సందర్భంగా తన విద్యార్థులకు అభినందనలు, రాష్ట్రపతి నిలయం  కార్య నిర్వహణ వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరెంతో మంది విద్యార్థులకు శిక్షణనిచ్చి కళారంగానికి పరిచయడం చేయడం గురువుగా తన బాధ్యత అని శ్రీజ తెలిపారు.