
మారుతి నెక్స్ట్ టార్గెట్ బన్నీ- చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి సినిమా 'రాజాసాబ్' తీయడం అన్నది ఊహించనది. అనుకోకుండా ఈ కాంబినేషన్ సెట్ అయింది. కామెడీ నేపథ్యం గల హారర్ చిత్రాలను ప్రభాస్ లైక్ చేసే హీరో కావడంతో మారుతికి ఈ ఛాన్స్ దక్కిందన్నది కాదనలేని వాస్తవం. ఈ కాంబినేషన్ లో సినిమా ప్రచారం మొదలైన కొత్తలో కొన్ని విమర్శలు కూడా తెరపైకి వచ్చాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతితో ఏ తరహా సినిమా చేస్తాడు? అన్నది ప్రధానంగా హైలైట్ అయింది.
మెగా కాంపౌండ్ కు చెందిన మారుతి కి బన్నీ అవకాశం ఇవ్వకుండా ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం ఏంటనే సందేహం కూడా వ్యక్తమైంది. కారణాలు ఏవైనప్పటికీ మారుతికి దర్శకుడిగా మంచి అవకాశం ఇది. 'రాజా సాబ్' సక్సెస్ అన్నది అతడిని స్టార్ డైరెక్టర్ల జాబితాలో నిలబెట్టే విషయం. ఇంత వరకూ మారుతి స్టార్ డైరెక్టర్ల జాబితాలో స్థానం సంపాదించని సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ కొంత మంది దర్శకులు మాత్రమే ఆ రేసులో ఉన్నారు.
వాళ్లతోనే రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, మహేష్ లాంటి స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి స్టార్లతో మారుతికి అవకాశాలు రావాలంటే రాజాసాబ్ సక్సెస్ అన్నది అత్యంత కీలకం. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ 2000 కోట్లపైనే. కానీ రాజాసాబ్ యూనివర్శల్ కాన్సెప్ట్ కాదు కాబట్టి ప్రభాస్ మార్కెట్ ఆధారంగా బేరీజు వేయడానికి లేదు. ఈ నేపథ్యంలో మారుతి తన కథా బలం...ప్రభాస్ ఇమేజ్ తో మెప్పించగలిగి మంచి వసూళ్లు సాధించిన చిత్రంగా రాజాసాబ్ ను అందించాలి. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అంటున్నారు. అలాగైతే సినిమా 1000 కోట్లు రాబట్టి నిలబడితే అప్పుడే మారుతి స్టార్ డైరెక్టర్ల లీగ్ లో చేరేది. బన్నీ...చరణ్ లతో సినిమాలు తీయాలన్నది మారుతికి ఎప్పటి నుంచో ఉన్న కల. ఆ కల సాకారమవ్వాలంటే? రాజాసాబ్ సక్సెస్ అత్యంత కీలకం.