
జూన్ 27నుంచి థ్రిల్లర్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’
‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో మాత్రమే ప్రీమియర్ కానుంది.
భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ZEE5 దూసుకుపోతోంది. గ్రామీణ వాతావరణం, ప్రకృతి సౌందర్యాల నడుమ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా వస్తున్న సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ను ప్రదర్శించడానికి ZEE5 సిద్ధంగా ఉంది. గ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఇన్వెస్టిగేషన్ అన్నీ కలిపి సీటు అంచున కూర్చునేలా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు.
1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఒక పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ వూతలూరు) ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.
ZEE5 తెలుగు బిజినెస్ హెడ్ - అనురాధ గూడూర్ మాట్లాడుతూ ‘ZEE5లో సాధారణ ప్రజలను ప్రతిబింబించే, వారికి కనెక్ట్ అయ్యే కథల్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనేది ఉత్కంఠను కలిగిస్తూనే సామాజిక సందేశాన్ని కూడా అందిస్తుంది. భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఈ సిరీస్ చూపిస్తుంది"అని అన్నారు.
దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ ‘‘రెక్కీ’ తర్వాత, మరోసారి ZEE5తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. దశాబ్ద కాలంగా వివాహాలను ఆపివేసిన గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ. అక్కడ ఒక స్త్రీ అందరూ భయపడే ప్రశ్న అడగడానికి ధైర్యం చేస్తుంది"అని అన్నారు.
సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘రెక్కీ’ విజయం తర్వాత, ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ కోసం మరోసారి ZEE5తో చేతులు కలపడం చాలా బాగుంది. ఈ కథ నాకు మొదటి నుంచీ ప్రత్యేకంగా నచ్చింది. ఈ కథ విన్నప్పటి నుంచీ నన్ను వెంటాడుతూనే ఉంది. టెలివిజన్ కోసం కథలను సృష్టించడం, పాత్రలను పోషించడం కోసం సంవత్సరాలు గడిపిన వ్యక్తిగా ఈ ప్రాజెక్ట్ నాకు మరింత ఉపయోగపడింది. ఈ సిరీస్‌తో మేం నిర్మించిన ప్రపంచం గురించి ఎంతో గర్విస్తున్నాను. ప్రేక్షకులు మేం క్రియేట్ చేసిన ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.
అభిజ్ఞ వూతలూరు మాట్లాడుతూ "ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా ఆనందంగా, సంతృప్తికరంగా ఉంది. ఈ పాత్రలో చాలా సున్నితత్వం, బలం ఉంటుంది. ముఖ్యంగా భయానికి అనుకూలంగా వాస్తవాలను ప్రశ్నించే ఓ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తాను. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో కలిసి షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను"అని అన్నారు.