కుబేర ఒక ఆనెస్ట్ ప్రయత్నం!
కుబేర ఒక ఆనెస్ట్ ప్రయత్నం!

శేఖర్ కమ్ముల ‘కుబేర’ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బిచ్చగాడు –బిలియనీర్ మధ్య జరిగే కథ ఇది. ప్రేమ కథలను ఎక్కువగా తీసే శేఖర్ నుంచి ఇలాంటి కంటెంట్ రావడం విశేషమే. శేఖర్ ఐడియాలజీ కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుంది. క్యాపిటల్, కమ్యూనిస్ట్ భావజాల సంఘర్షణతో తయారైన కథ ఇది.

అయితే సినిమా మిడిల్‌కు వచ్చేసరికి రాజు – పేద యుద్ధంలో చివరికి పేదవాడిని గెలిపిస్తేనే ఆడియెన్స్‌కు తృప్తి. శేఖర్ కూడా ఇదే టేక్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ‘కుబేర’లో చాలా పెద్ద పాయింట్ ఉంది. ఇలాంటి కథలను సినిమాగా చెప్పినప్పుడు చివరికి బలహీనుడిని గెలిపిస్తేనే సినిమా నెగ్గుతుంది. ‘కుబేర’లో కూడా అదే టేక్ ఉంటుంది. అయితే ఆ గెలిచే విధానం ఆడియెన్స్‌కి థ్రిల్ పంచుతుందని చెప్పుకొచ్చారు శేఖ‌ర్.

ఇదే సందర్భంలో తన మార్క్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ‘నా మీద ఒక మార్క్ పడింది కానీ నేను మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. అయితే నావి ఎక్కువగా మ్యూజికల్ హిట్స్, లవ్ స్టోరీలు ఉంటాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది. లీడర్ సినిమా చాలా ఆనెస్ట్ గా చెప్పిన కథ. హ్యాపీ డేస్ లో కూడా అంతే. కాలేజ్ స్టోరీ అంటే కాలేజ్ స్టోరీ లానే ట్రీట్ చేశాను. కుబేర కూడా అంతే. ఈ కథకు కావలసిందే చేశాను’ అన్నారు.