ఉత్కంఠ రేకెత్తించే ‘విరాటపాలెం'ట్రైలర్‌ విడుదల..
ఉత్కంఠ రేకెత్తించే ‘విరాటపాలెం'ట్రైలర్‌ విడుదల..

భారతదేశపు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 తన వీక్షకులు, సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పుడూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. తెలుగులో విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే ZEE5 ఇప్పుడు ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ అనే ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో అలరించబోతోంది.  సోషల్ మీడియా సెన్సేషన్ అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై KV శ్రీరామ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ జూన్ 27న ప్రత్యేకంగా ZEE 5లో ప్రీమియర్ కానుంది.

ఈ క్రమంలో తాజాగా ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విరాటపాలెం గ్రామంలో ఓ శాపం ఉంటుంది. ఆ ఊర్లో ఏ పెళ్లి జరిగినా సరే మరుసటి రోజు పెళ్లి కూతురు చనిపోతుంటుంది. అలా పదేళ్లుగా ఆ ఊరిని శాపం పట్టి పీడిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. అలాంటి ఊరికి లేడీ కానిస్టేబుల్‌ మీనా (అభి) వస్తుంది. ఊరి ప్రజల మూఢ నమ్మకాన్ని, ఆ ఊరి రహస్యాల్ని పటా పంచెలు చేయడానికి పెళ్లికి రెడీ అవుతుంది మీనా. ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఈ మరణాల వెనుకున్న సీక్రెట్ ఏంటి? కానిస్టేబుల్ మీనా నిజాన్ని ఊరి ప్రజలకు తెలిసేలా చేసిందా? లేదా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు.

ఇక ఈ ట్రైలర్‌ను చూస్తే వాతావరణం అంతా కూడా 80వ దశకానికి చెందినట్టుగానే కనిపిస్తోంది. నటీనటుల కట్టూబొట్టూ, మాట తీరు, విజువల్స్ అన్నీ కూడా ఆ కాలానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తున్నాయి. మ్యూజిక్, విజువల్స్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ కానున్నాయనిపిస్తోంది. ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. కుటుంబ సమేతంగా ఈ సిరీస్‌ను చూడొచ్చు.

చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకర, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. దివ్య తేజస్వి పెరా ఈ సిరీస్‌కు కథను, విక్రమ్ కుమార్ కండిమల్ల స్క్రీన్‌ప్లేని అందించారు. రోహిత్ కుమార్ నేపథ్య సంగీతం సమకూర్చారు. మహేష్ కె స్వరూప్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేశారు. ఫరూఖ్ హుండేకర్ ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వహించారు. జూన్ 27 నుంచి ZEE5లో ప్రత్యేకంగా ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ ప్రీమియర్‌ కానుంది.