వింటేజ్ లుక్కు.. బాక్సాఫీస్‌కు ఫుల్ కిక్కు..
వింటేజ్ లుక్కు.. బాక్సాఫీస్‌కు ఫుల్ కిక్కు..

స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ రాగానే దర్శకులు ఒక రకమైన ఎక్సైట్మెంట్ తో పాటు కంగారు కూడా వస్తుంది. వాళ్ళని ఎలా చూపించాలి, ఎలాంటి కథ రాసుకోవాలి, ఏం చేయాలి అంటూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ మధ్య ఆ కంగారుకు కాంబో పెట్టారు మన దర్శకులు. స్టార్ హీరోలతో వచ్చిన ఆఫర్ ను అంతా ఒకేలా వాడుకుంటున్నారు. అదేంటో  చూద్దామా?

స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పుడు దర్శకులకు మామూలు ఎక్సైట్మెంట్ ఉండదు. అందుకే మరి కొత్త ధనానికి వెళ్ళకుండా, రిస్క్ తీసుకోకుండా సింపుల్ గా వింటేజ్ లుక్స్ ఫాలో అవుతూ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ని క్యాచ్ చేసుకుంటున్నారు.

అఖండ 2లో బోయిపాటి చేస్తోంది ఇదే. మరోవైపు ఓజీలో సుజీత్, ఉస్తాద్ లో హరీష్ శంకర్ కూడా పవన్ వింటేజ్ లుక్ బయటికి తీసుకొస్తున్నారు. ఈ మధ్య బాలయ్య దర్శకులు వరుసగా ఆయనలోని వింటేజ్ లుక్ బయటికి తెస్తున్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరికి అది బాగా హెల్ప్ అయింది. అఖండ 2కు ఇదే జరుగుతోంది.

వెంకటేష్ లోని వింటేజ్ కామెడీ వర్క్ అవుట్ అయితే ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాం లో చూపించారు అనిల్ రావిపుడి. తాజాగా చిరంజీవిలో ఉన్న కామెడీ టైమింగ్ తో రఫ్ఫాడిస్తున్నారు ఆ దర్శకుడు. ఈ మధ్య టైగర్ నాగేశ్వర్ రావు ఈగ లాంటి ప్రయోగాలు చేసిన రవితేజ కూడా మాస్ జాతర  కోసం పూర్తిగా వింటేజ్ లుక్ లోకి మారిపోయాడు. సినిమా రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజలోని ఎంటర్ టైనింగ్ యాంగిల్ బయటికి తీసుకొస్తున్నారు. ధమాకా తర్వాత మరోసారి శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రవితేజ.

దాదాపు పదేళ్ళ తర్వాత ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూపించిన ఘనత మారుతికే దక్కింది. తాజాగా విడుదలైన రాజాసాబ్ టీజర్ చూసి మురిసిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. పదేళ్లుగా వాళ్ళు మిస్ అయిన ప్రభాస్ ఉన్నారు ఇందులో. వింటేజ్ లుక్స్ వర్క్ అవుట్ అయ్యాయి కాబట్టే రొటీన్ కథలతో వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, ధమాకా, సంక్రాంతికి వస్తున్నాం రఫ్ఫాడించాయి. అందుకే జై వింటేజ్ లుక్స్ అంటున్నారు మేకర్స్.