కిశోర్ కి ఐకానిక్ సినిమాటోగ్రాఫర్ అవార్డు!
కిశోర్ కి ఐకానిక్ సినిమాటోగ్రాఫర్ అవార్డు!

ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వాని నటించిన "105 మినిట్స్" చిత్రానికిగాను... సినిమాటోగ్రఫీ విభాగంలో "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్" ఆదుకున్నారు టాలెంటెడ్ యువ కెమెరామెన్ కిషోర్ బొయిదాపు. పరిమిత బడ్జెట్ లో.. సింగిల్ క్యారక్టర్ తో..సింగిల్ షాట్ లో తెరకెక్కడం "105 మినిట్స్" సినిమాలో ప్రత్యేకత! హైద్రాబాద్ లో నిన్న (జూన్ 27, 2025) లీ-మెరిడియన్ హోటల్ లో కోలాహలంగా జరిగిన వేడుకలో కిషోర్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు.

ఈసందర్భంగా "105 మినిట్స్" చిత్ర దర్శకులు రాజు దుస్సా, నిర్మాత బొమ్మక్ శివలకు కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు!

రవిప్రసాద్ యూనిట్ లో కెమెరా అసిస్టెంట్ గా తన కెరీర్ ప్రారంభించిన కిషోర్... అనతికాలంలోనే అంచెలంచెలుగా కెమెరామెన్ స్థాయిని సాధించారు."స్లమ్ డాగ్ మిలియనీర్, మిషన్ ఇంపాజిబుల్-4, లెటర్స్, సూటబుల్ బాయ్స్" వంటి హాలీవుడ్ ప్రోజెక్టులకు సెకండ్ యూనిట్ కెమెరామెన్ గా తన ప్రతిభ కనబరిచిన కిశోర్ ప్రఖ్యాత సినిమాటోగ్రఫర్ అనిల్ మెహతా ప్రియ శిష్యుడిగా"సీక్రెట్ సూపర్ స్టార్, ఏ దిల్ హై ముష్కిల్, బియాండ్ ది క్లౌడ్స్, హిందీ జెర్సీ" వంటి పలు చిత్రాలకు పనిచేయడంతోపాటు..అగ్ర హీరోలు నటించిన అనేక యాడ్ ఫిల్మ్స్ సైతం హ్యాండిల్ చేశారు!!

"బోయ్ మీట్స్ గర్ల్"తో కెమెరామెన్ గా మారిన కిషోర్.."కిరాక్, వశం,నాగు గవర దర్శకత్వం వహించిన "కర్త - కర్మ - క్రియ, 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శృతి" చిత్రాలకు ఛాయాగ్రహణం చేశారు. సునీల్ నటిస్తున్న "ఆన్ ది వే", ఆది సాయికుమార్ "రుధిరాక్ష", బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ, శివాజీ, భూమిక నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. జేబు శాటిసిఫేక్షన్ కంటే జాబు శాటిసిఫేక్షన్ కి ప్రాధాన్యతగా పేర్కొనే కిషోర్.. ప్రపంచవ్యాప్తంగా పలు భాషలకు చెందిన టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ సినిమాలు తెరకెక్కించే తీరుతెన్నులను నిశితంగా గమనిస్తూ.. వారి ఇంటర్వ్యూలు ఫాలో అవుతూ తనను తాను అప్ డేట్ చేసుకుంటూ ఉంటారు. ముంబై నుంచి హైద్రాబాద్ కు షిఫ్ట్ అయిపోయిన కిషోర్ ఇకపై తన ఫోకస్ తెలుగు సినిమాలపై మాత్రమేనని తెలిపారు!!