‘దిల్ రాజు డ్రీమ్స్’ క్రియేట్ చేసిన దిల్ రాజు గారు గ్రేట్!
‘దిల్ రాజు డ్రీమ్స్’ క్రియేట్ చేసిన దిల్ రాజు గారు గ్రేట్!

‘దిల్ రాజు డ్రీమ్స్’ క్రియేట్ చేసిన దిల్ రాజు గారు గ్రేట్!

"దిల్ రాజు డ్రీమ్స్’లో యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌తో పాటు ప్రొడ్యూసర్స్‌కి కూడా ఒక కాలమ్ కేటాయించడం గొప్ప విషయం. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌ నేను ఇదివరకు ఎక్కడా చూడలేదు" అన్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్

"ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్తవారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో 'దిల్ రాజు డ్రీమ్స్' వెబ్‌సైట్‌"ని లాంచ్ చేస్తున్నాం" అన్నారు నిర్మాత దిల్ రాజు.
 
"కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ ని లాంచ్ చేస్తున్నాం" అన్నారు నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. 

విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. 
విజయ్ దేవరకొండ " 13 ఏళ్ల క్రితం పొద్దున లేచిన వెంటనే idlebrain డాట్ కామ్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసే వాడిని. ఎక్కడైనా కాస్టింగ్ కాల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకునే వాడిని. ఆ రోజుల్లో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా లేదు. శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కాస్టింగ్ కాల్ అందులో చూడడం నాకు ఇంకా గుర్తుంది. దానికి అప్లై చేశాను. దాదాపు 6 నెలలు టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ కూడా ఒక తృప్తినిచ్చేది. ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఆపర్చునిటీ ఉందనే ఆనందం ఉండేది. 16 వేల అప్లికేషన్స్ ఆ సినిమాకి వచ్చాయి. 11 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను ఉన్నాను. ఆ సినిమా నా జీవితంలో పెద్ద రోల్ ప్లే చేసింది. ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. "దిల్ రాజు డ్రీమ్స్"ని దిల్ రాజు గారికి ఎందుకు లాంచ్ చేయాలని అనిపించిందో నాకు తెలియదు కానీ ఇది లక్షలాది మందికి ఒక హోప్ నిచ్చింది. ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికీ నా బెస్ట్ విషెస్. అప్లై చేసిన ప్రతి ఒక్కరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఇందులో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్సైట్ లాంచ్ చేయడానికి న్యాయం జరిగినట్టే. దిల్ రాజు గారు 14 మంది డైరెక్టర్స్ ని లాంచ్ చేశారు. ఈ వేదిక ద్వారా నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ని లాంచ్ చేయబోతున్నారు. ఐదేళ్ల తర్వాత మీలో కూడా ఎవరో ఒకరు ఇలా స్టేజ్ మీద నిలబడి దిల్ రాజు డ్రీమ్స్ లాగ తమ డ్రీమ్ ని కూడా నెరవేర్చుకున్నామని చెప్తే చాలా ఆనంద పడతాను. ఇంత అద్భుతమైన ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసిన దిల్ రాజు గారికి అభినందనలు.అందరికీ థాంక్స్" అన్నారు. 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ " ఇంత మందిని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఒక క్రియేషన్ ఒకరి కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసే వారికంటే నిరుత్సాహపరిచే వారు ఎక్కువ మంది ఉంటారు. అయితే మన పక్కనున్న వాళ్ళు మనల్ని నిరుత్సాహపరిస్తే మనలో ఒక ఫైర్ రావాలి. ఎంతమంది నిరుత్సాహపరిచినా మీ కలని మీరు నమ్మి ముందడుగు వేసుకుంటూనే వెళ్ళండి. ఎవరూ ఆపలేరు. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు, శిరీష్ గారు..విజయ్ దేవరకొండ.. మన కలని మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. రాజుగారంటే మాకు ఫ్యామిలీ మెంబర్. ఆయన నాకు పెద్దన్నయ్య లాంటివారు. "దిల్ రాజు డ్రీమ్స్" అనేది ఒక అద్భుతమైన వేదిక. యాక్టర్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ తో పాటు ప్రొడ్యూసర్స్ కి కూడా ఒక కాలమ్ కేటాయించడం గొప్ప విషయం. ఇలాంటి వెబ్సైట్ నేను ఇదివరకు ఎక్కడా చూడలేదు. గొప్ప ప్రొడక్షన్ హౌస్ ఈ వెబ్సైట్ ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది మీ అందరికీ ఒక గొప్ప ఫ్లాట్ ఫామ్. సక్సెస్ అనేది మన అల్టిమేట్ టార్గెట్ గా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే లైఫ్లో డల్ మూమెంట్ అనేది ఉండదు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్"అన్నారు 

ప్రొడ్యూసర్ శిరిష్ " ఇంతమంది కొత్త టాలెంట్ ను ఆశీర్వదించడానికి వచ్చిన దేవి శ్రీ ప్రసాద్ గారికి, విజయ్ దేవరకొండకి చాలా థాంక్స్. ఇక్కడికి ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు వచ్చారు. మీ ట్యాలెంట్ తో ఎదిగిన తర్వాత ఇండస్ట్రీని మర్చిపోవద్దు. ఇది ప్రామిస్ చేసి ఎంటర్ అవ్వండి. మీరు సక్సెస్ అవుతారు. థాంక్యూ"అన్నారు. 

నిర్మాత దిల్ రాజు "విజయ్, దేవి థాంక్యూ. ఆర్య నుంచి దేవితో నాకు జర్నీ ఉంది. ఒక సక్సెస్ఫుల్ ఆల్బమ్ చేయడానికి దేవి ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అలాగే విజయ్ దేవరకొండ ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జర్నీ మొదలుపెట్టి ఈరోజు ఒక కింగ్డమ్ క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ సినిమా తర్వాత ఎంతోమంది కొత్త దర్శకుల్ని లాంచ్ చేసాం. వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో 57 సినిమాలు పూర్తయ్యాయి. నేను శిరీష్ కథ విని బాగుందన్న తర్వాతనే స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. అలానే 57 సినిమాలు పూర్తి చేశాం. హర్షిత్ హన్సిత దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పెట్టి బలగం వేణు తో పాటు నలుగురు కొత్త దర్శకుల్ని పరిచయం చేశారు. వాళ్లు కూడా కొత్త దర్శకులతో అన్ని రకాల సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త దర్శకులు కొత్త నిర్మాతలు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు.
అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచన ఈ దిల్ రాజు డ్రీమ్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద భారీ సినిమాలు తీస్తున్నాం. దిల్ రాజ్ ప్రొడక్షన్ పై కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. కొత్త టాలెంట్ కోసం ఒక కొత్త టీంని ఏర్పాటు చేసినప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దిల్ రాజు డ్రీమ్స్ సంస్థని ఒక యంగ్ జనరేషన్ టీం తో ఫామ్ చేసాము. చాలామంది నిర్మాతలుగా రావాలనుకుంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గాని సినిమాని ఎలా మొదల పెట్టాలి ఎలా కంప్లీట్ చేయాలో క్లారిటీ ఉండదు. కొంతమంది సినిమా తీశాము వీడియో చూడండి అని చూపిస్తుంటారు. సినిమా తీయడం ముఖ్యం కాదు సినిమాని తీసి ప్రేక్షకులు దగ్గరికి తీసుకెళ్లడం పెద్ద టాస్క్, అందరికీ సినిమాల్లోకి రావాలని పాషన్ వుంది. కానీ రైట్ ఫ్లాట్ ఫామ్ వాళ్లకి దొరకదు. అలాంటి రైట్ ఫ్లాట్ ఫామ్ ని క్రియేట్ చేయడానికి దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం. దాదాపు 2000 మంది ఈవెంట్ కి వచ్చారంటే మీలో ఎంతమందికి సినిమా పైన పాషన్ ఉందో అర్థం అవుతుంది. మేము ఇక్కడికి రావడానికి 30 ఏళ్లు పట్టింది. కానీ సినిమాలోకి రావడం ఇక్కడ రాణించడం అంత ఈజీ కాదు. వందమంది దర్శకులు కావాలని ప్రయత్నిస్తే అందులో ఐదు మందికి ఛాన్స్ వస్తుంది.ఒకరు హిట్ సినిమా తీస్తారు. అంటే ఇక్కడ సక్సెస్ అనేది 1%. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా కోసం మీరు చేస్తున్న వర్క్ ని విడిచి పెట్టకండి. మేము కూడా అలానే చేసాము. సినిమాలో సక్సెస్ అయ్యేవరకు మేము చేస్తున్న ఆటోమొబైల్స్ బిజినెస్ ని వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయితే మళ్లీ వెనక్కి వెళ్లి బిజినెస్ చేసుకోవాలి. సినిమా వల్ల మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. మేము కూడా ఇక్కడ స్ట్రగుల్స్ పడ్డాం. అయితే వదలకుండా ప్రయత్నించాం. సాధించాం. నిజానికి సినిమా ఇండస్ట్రీలో మనం రాణించగలుగుతామా లేదా అనేది మీకే తెలియాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. సినిమా అనేది ఒక అట్రాక్షన్. అది లాగుతుంటుంది. జీవితాలు మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎప్పుడైతే మీరు సినిమాలో సక్సెస్ అవుతున్నారని మీకు అర్థం అవుతుందో అప్పుడు మీరు 24 గంటలూ కష్టపడాలి. మేము విజయ్ దేవి నాని ఇలా అందరూ ఇండిపెండెంట్ గా సక్సెస్ అయి వచ్చిన వాళ్ళమే. అంతకుముందు జనరేషన్ లో చిరంజీవి గారు రజనీకాంత్ గారు అందరూ కూడా ఇండిపెండెంట్ గానే సక్సెస్ సాధించారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా అంటేనే హార్డ్ వర్క్.దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా మేము ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. దీనికి మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. దానిలో టీమ్ స్క్రూటినీ చేసి మెజారిటీ పీపుల్ లైక్ చేసిన తర్వాత మా దగ్గరకి పంపిస్తారు. మేము టైం స్పెండ్ చేసి దాన్ని ఓకే చేస్తాము. కానీ చాలామంది రిజెక్ట్ అవ్వచ్చు. అంతమాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. మీలో కాన్ఫిడెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. దిల్ రాజు డ్రీమ్స్ లో ఒక ప్రొడ్యూసర్ కాలమ్ కూడా పెడుతున్నాం. సినిమా గురించి మా టీం అనాలిసిస్ చేసి చెప్తారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మోసాలు ఉంటాయి. అన్నిటి మీద అవగాహనతో ముందుకు రావాలి. ఈవెంట్ కి రావడానికి పదివేల రిజిస్ట్రేషన్ లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా లక్ష నుంచి రెండు లక్షల మంది సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఈ ప్లాట్ ఫామ్ ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థం అవుతుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్"అన్నారు.