
'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' జూలై 17న గ్రాండ్ రిలీజ్ !
యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
హీరో నరేష్ అగస్త్యతో పాటు ప్రధాన నటులంతా కనిపించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ చాలా ప్లజెంట్ గా వుంది.
జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. మోహన కృష్ణ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.
'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.