Warning: unlink(/home/u917478803/domains/tfda.in/storage/cache/cache.topic.c8d6063b6fc14549333e30c208dd9de6.1748741870): No such file or directory in /home/u917478803/domains/tfda.in/public_html/system/library/cache/file.php on line 79 రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రీ మూవీ మేకర్స్‌ #RAPO22 లో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం
రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రీ మూవీ మేకర్స్‌ #RAPO22 లో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం
రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రీ మూవీ మేకర్స్‌ #RAPO22 లో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ #RAPO22తో అదరగొట్టబోతున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా హార్ట్ టచ్చింగ్ ఎంటర్టైనర్ లా వుండబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్  బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు.

ఈ కథలో కొత్త కోణాన్ని తెస్తూ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర "సూర్య కుమార్" పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర ప్రతి ఒక్కరు అభిమానించే సూపర్ స్టార్‌ల ప్రతినిధిగా నిలుస్తుంది. ఇవాళ విడుదలైన పోస్టర్‌లో ఆయన పాపరాజీ లైట్ల మధ్య స్టైలిష్‌గా కనిపించి, తన స్క్రీన్ ఇమేజ్‌ తో అదరగొట్టారు. ఈ నెల 15న సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది.

ఈ చిత్రంలో కంప్లీట్ డిఫరెంట్ గెటప్‌లో రామ్ పోతినేని కనిపించనున్నారు. ఇప్పటి వరకు చేసిన హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాతో ఆయన ఓ కొత్త అవతార్ ని ప్రజెంట్ చేస్తోంది. దర్శకుడు మహేష్ బాబు పి ఈ కథను అద్భుతంగా మలిచారు. పాన్-ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం అత్యున్నత స్థాయిలో ఉండబోతోంది

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. కెమెరామెన్‌గా సిద్ధార్థ నుని కాగా వివేక్–మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.ఈ డ్రీమ్ టీమ్ తో #RAPO22 భారీ స్థాయిలో రూపొందుతోంది.

తారాగణం:
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వి.టి.వి గణేష్ తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సిఈఓ: చెర్రీ
సంగీతం: వివేక్ - మెర్విన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్‌ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో