Photos

Director VN Aditya about Ustaad Bhagat Singh at Vimal Theatre

TFDA

12 hours ago

ఆశిష్, ఆదిత్య రావు గంగాసాని, దిల్‌ రాజు & శిరీష్ కల్చరల్ డ్రామా 'దేత్తడి' సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు.

ఇప్పటిటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. ఆశిష్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

“'దేత్తడి” సినిమాలో హై ఎమోషన్‌తో పాటు కొత్తగా చూపించే కల్చరర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉండబోతోంది.

ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్ జునైద్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు క్రియేటివ్ హెడ్‌గా కూడా పని చేస్తున్నారు.

తారాగణం: ఆశిష్

సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్
కథ, దర్శకత్వం: అదితిరావు గంగసాని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, క్రియేటివ్ హెడ్: ప్రసన్న కుమార్ బెజవాడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి పున్నా (బిట్టు)
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
ఆశిష్, ఆదిత్య రావు గంగాసాని, దిల్‌ రాజు & శిరీష్ కల్చరల్ డ్రామా 'దేత్తడి' సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్
TFDA

12 hours ago

Raaj Kamal Films International and Turmeric Media are delighted to reveal, on the special occasion of her birthday, that actress Bhagyashri Borse is part of the cast of Seyon.

Starring Sivakarthikeyan in a powerful new role and directed by Sivakumar Murugesan, Seyon is positioned as a grand rural commercial entertainer and one of the most anticipated releases of 2026. Backed by Kamal Haasan and R. Mahendran under the banner of Raaj Kamal Films International, the film features music by Santhosh Narayanan.

The team of Seyon extends a warm welcome to Bhagyashri Borse and wishes her a very Happy Birthday, looking forward to an exciting cinematic journey together.

శివకార్తికేయన్, శివకుమార్ మురుగేశన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, ఆర్కేఎఫ్ఐ, టర్మరిక్ మీడియా 'సెయాన్' లో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే- డివైన్ ఫస్ట్ లుక్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో, కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న 'సెయాన్' కోసం చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అమరన్ తర్వాత శివకార్తికేయన్ మరోసారి రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కొలాబరేట్ కావడం విశేషం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆ చిత్రంతో ఏర్పడిన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు మరింత బలపడింది.

గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్.. ట్రెడిషన్‌, డివైన్ వైబ్ మేళవింపుగా ఆకట్టుకుంటోంది. గాజుల షాప్ బ్యాక్‌డ్రాప్‌లో ఆమె కనిపించిన తీరు పాత్రలోని ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. మురుగన్ స్వామి ప్రతీకను గుర్తు చేస్తూ ఆమె కూర్చున్న తీరు మరింత ఆసక్తిని పెంచింది.

రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శివకార్తికేయన్, ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కలిసి పనిచేస్తున్న తొలి సినిమా కావడం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకగా నిలిచింది. తన ప్రత్యేకమైన మ్యూజికల్ స్టైల్‌తో, చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్‌తో పేరుగాంచిన సంతోష్ నారాయణన్ సంగీతం ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లెగసీ, టర్మరిక్ మీడియా విజన్ కలిసిన “సెయాన్” 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలవనుంది.

తారాగణం: శివకార్తికేయన్, భాగ్యశ్రీ బోర్సే

దర్శకత్వం: శివకుమార్ మురుగేశన్
నిర్మాత: కమల్ హాసన్ - ఆర్. మహేంద్రన్
బ్యానర్స్: రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా
సంగీతం: సంతోష్ నారాయణన్
Raaj Kamal Films International and Turmeric Media are delighted to reveal, on the special occasion of her birthday, that actress Bhagyashri Borse is part of the cast of Seyon.

Starring Sivakarthikeyan in a powerful new role and directed by Sivakumar Murugesan, Seyon is positioned as a grand rural commercial entertainer and one of the most anticipated releases of 2026. Backed by Kamal Haasan
TFDA

12 hours ago

Rohith Nara, Chinimilli Manikumar, Bharath Chowdary, Karan C Productions LLP's Production No 5- #RN23 Announced

Rohith Nara, known for consistently backing strong, content-driven cinema, has officially announced his next venture with Karan C Productions LLP. Touted as the banner’s ambitious Production No 5, the project, currently being called #RN23, is envisioned as a wholesome romcom family entertainer. The project will be bankrolled by Bharath Chowdary and marks the directorial debut of Chinimilli Manikumar, who is also handling the story and screenplay. With a fresh creative voice steering the film and a concept rooted in universal emotions, expectations are steadily building around the venture.

The announcement poster, carrying the intriguing tagline “Shouting Soon,” instantly grabs attention and sets the stage for what promises to be a lively entertainer. With Rohith Nara at the forefront and a story crafted to connect with both youth and family audiences, #RN23 is shaping up to be a complete package. Seamlessly blending humor, heartfelt emotions, romance, and engaging family drama, the film aims to deliver a vibrant, relatable narrative that appeals to a wide spectrum of viewers.

The makers are expected to formally launch the film with a grand muhurtham ceremony in the near future. Details regarding the cast, technical crew, and regular shooting schedule are set to be revealed soon.

Cast: Rohith Nara

Production banner : Karan C Productions LLP
Producer : Bharath Chowdary
Story-Screenplay-Direction: Chinimilli Manikumar
PRO: Vamsi Shekar
Marketing: Haashtag Media

రోహిత్ నారా, చినిమిల్లి మణికుమార్, భరత్ చౌదరి, కరణ్ సి ప్రొడక్షన్స్ LLP ప్రొడక్షన్ 5, #RN23 అనౌన్స్‌మెంట్

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే రోహిత్ నారా, కరణ్ సి ప్రొడక్షన్స్ LLPతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన 5వ ప్రొడక్షన్ గా రూపొందుతున్న #RN23 కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఈ ప్రాజెక్ట్‌ను భరత్ చౌదరి నిర్మిస్తుండగా, చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. యూనివర్సల్ ఎమోషన్స్‌తో కూడిన కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

"షౌటింగ్ సూన్" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఉన్న అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలను కలగలిపిన వినోదాత్మక కథతో ఈ సినిమా రాబోతోంది.

త్వరలోనే ముహూర్తం వేడుకతో చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇతర నటీనటులు, సాంకేతిక బృందం రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు: రోహిత్ నారా

నిర్మాణ సంస్థ: కరణ్ సి ప్రొడక్షన్స్ LLP
నిర్మాత: భరత్ చౌదరి
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: చినిమిల్లి మణికుమార్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
Rohith Nara, Chinimilli Manikumar, Bharath Chowdary, Karan C Productions LLP's Production No 5- #RN23 Announced

Rohith Nara, known for consistently backing strong, content-driven cinema, has officially announced his next venture with Karan C Productions LLP. Touted as the banner’s ambitious Production No 5, the project, currently being called #RN23, is envisioned as a wholesome romcom family
TFDA

12 hours ago

'పెద్ది' కథ విన్న తర్వాత 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయాను. అంతలా కదిలించింది. పెద్ది కోసం 70-80 పీరియడ్ ని రిక్రియేట్ చేశాం. ఈ సినిమా కోసం వేసిన సెట్స్ ని ఆడియన్స్ గుర్తించలేరు. అంత నేచురల్ గా వుంటాయి: ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-నా పదేళ్ల కెరీర్‌లో ఒక కథకి ఇంతలా ఎక్సైట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. డైరెక్టర్ గారు కథ చెప్పిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయాను. అంతలా కదిలించింది. కథలోనే ఇంత బలం ఉంది కాబట్టి ప్రొడక్షన్ డిజైన్ పరంగా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను.

ఇది పీరియడ్ డ్రామా కదా.. సెట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ఆడియన్స్‌కి సెట్ అని తెలియకపోవాలి. అప్పుడే ఒక ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయినట్టు. నా వరకు ఈ సినిమాకి వేసిన సెట్స్‌ను ఆడియన్స్ అవి సెట్ అని గ్రహించలేరు. అంత నేచురల్‌గా ఉంటాయి.

-ఇది 70-80లలో జరిగే కథ. ఇదివరకే చాలా పీరియడ్ సినిమాలు చేశాను. ఆ అనుభవం నాకు ఉంది.

-‘పెద్ది’ విజయనగరం ఏరియాలో జరిగే కథ. అక్కడి వీధులు, క్లాక్ టవర్ ఇవన్నీ కూడా రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డిజైన్ చేశాం. అలాగే కుస్తీ, క్రికెట్ ఆటల విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఇందులో ఇప్పటివరకు ఎవరూ చూడని కుస్తీ సెటప్ చేశాం. దానికోసం అండర్‌గ్రౌండ్ సెటప్‌లో షూట్ చేశాం. చరణ్ గారు గదతో కనిపించిన షాట్ అక్కడే చేశాం.

డీవోపీ రత్నవేలు గురించి?
డీవోపీకి, ఆర్ట్ డైరెక్టర్‌కి ఒక సింక్‌లో ఉంటే సినిమా ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందులో అలాంటి మంచి సింక్ కుదిరింది. రత్నవేలు గారితో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మంచి కోఆర్డినేషన్‌తో వర్క్ చేశాం.

ఇందులో క్రికెట్ ఉంది కదా.. ‘లగాన్’ లాగా ఉంటుందా?
లేదండి. ‘లగాన్’ బ్రిటిష్ కాలంలో జరిగిన కథ. ఇది 70-80 మధ్యలో విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మన ఊర్లో పొలాల గట్ల మీద కూర్చుని క్రికెట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అంత నేచురల్ ఫీలింగ్ క్యారీ అవుతుంది.

-ఈ సినిమాకి ఏడాదికిపైగానే ప్రీ ప్రొడక్షన్ చేశాం. ఆ సమయంలోనే ప్రతి సెట్‌కు సంబంధించిన మినియేచర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఈ సినిమాకి వేసిన ప్రతి సెట్‌ను కూడా ఓపెన్ గ్రౌండ్‌లోనే వేశాం. నేచురల్ లైట్‌లోనే తీశాం.

-ఇందులో ఒక హిల్ స్టేషన్ ఊరు కావాలి. అది హైదరాబాద్‌లోని ఒక బూత్ బంగ్లాలో వేశాం. మీరు సినిమా చూస్తున్నప్పుడు అది ఒక కొండ కింద ఉన్న ఊరిలా అనిపిస్తుంది. ఆ సెట్ వేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.

-డైరెక్టర్ బుచ్చిబాబు గారు, నేను చాలా మంచి కోఆర్డినేషన్‌తో వర్క్ చేశాం. ఇందులో చెరుకు ఫ్యాక్టరీ ఉంటుంది. అది కూడా సెట్. కాకపోతే అందులో బ్యూటీ ఏంటంటే మీరు ఒక్కటీ కూడా సెట్ అని పసిగట్టలేరు.

‘పెద్ది’ కోసం ఎన్ని సెట్లు వేశారు?
-స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60-70 పైగానే ఉంటాయి. చిన్న సినిమా అయితే మనం ఎక్కడికైనా వెళ్లి షూట్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌తో వెళ్లి షూట్ చేయడం మామూలు విషయం కాదు. లోకేషన్స్ మన కంఫర్ట్‌లో పెట్టుకుంటేనే షూట్ చేయగలుగుతాం. విజయనగరం సెట్ వేసి దాదాపు ఏడాది అవుతుంది. ఎప్పుడు కావాలిస్తే అప్పుడు షూట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అన్ని వెదర్ కండిషన్స్‌కు అనుకూలంగా ఉండేలాగే ఆ సెట్ వేసాం.

-ఇందులో హీరో గారు వాడే బ్యాట్ కూడా చాలా నేచురల్ ప్రొడక్షన్ డిజైన్ నుంచి వచ్చింది. ఒక దేశీ ఆటగాడు తనకు దొరికే ముడిసరుకులతో బ్యాట్‌ని ఎలా తయారు చేసుకుంటాడో ఆ బ్యాట్ కూడా అంతే నేచురల్‌గా ఉంటుంది. అలాగే తనకు ఒక మేనరిజం ఉంటుంది. అవన్నీ కూడా అందులో రూపొందించడం జరిగింది.

చరణ్ గారితో మీ బాండింగ్ గురించి?
-నేను వేసిన ప్రతి సెట్‌ని చరణ్ గారు అప్రిషియేట్ చేశారు. ట్రైన్ సెటప్, స్పెషల్ సాంగ్ సెట్, కుస్తీ... ఇలా ప్రతి సెట్ ఆయనకి చాలా నచ్చాయి. చరణ్ గారిని కలవడానికి వచ్చిన చాలామంది కూడా సెట్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయని చెప్పారు.

చరణ్ గారికి గాయం ఎలా అయింది?
యాక్షన్ సీక్వెన్స్‌లో కుస్తీ సమయంలో అయింది. అలాంటి కండీషన్‌లో కూడా చరణ్ గారు వెంటనే మళ్లీ షూటింగ్‌లోకి వచ్చారు. ఎందుకంటే ఆ నెల షూట్ చేయకపోతే ఆర్టిస్ట్ డేట్స్ అన్నీ మిస్ అయిపోతాయి. అందుకే మళ్లీ వెంటనే వచ్చి చేశారు.

‘పెద్ది’ కథ గురించి?
ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ‘పెద్ది’ జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారు. కచ్చితంగా ఆ ఎమోషన్ అయితే ఉంటుంది.

-సుకుమార్ గారు మొన్న ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ‘రంగస్థలం’కి మించి ఉంటుందని అన్నారు. దానికి కారణం ఈ కథలో అంత బలం ఉంది.

మీ నుంచి కొత్తగా రాబోతున్న సినిమాలు?
‘పారడైజ్’, అలాగే చిరంజీవి గారి సినిమా
'పెద్ది' కథ విన్న తర్వాత 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయాను. అంతలా కదిలించింది. పెద్ది కోసం 70-80  పీరియడ్ ని రిక్రియేట్ చేశాం. ఈ సినిమా కోసం వేసిన సెట్స్
ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు.

"లెజెండరీ నిర్మాత ఆర్.బి. చౌదరి గారి ఆకస్మిక దుర్మరణం మనసుని కలిచివేసింది.

ఆయనతో నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. నా చిత్రం “గాడ్ ఫాదర్” కోసం సూపర్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా ఆయనతో పని చేసే అవకాశం దక్కింది.

ఆర్.బి. చౌదరి గారు ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, నటుల కెరీర్‌లను తీర్చిదిద్దుతూ, అనేక అద్భుత కథలను తెరపైకి తీసుకొచ్చిన గొప్ప నిర్మాత.

భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు వర్ణనాతీతం.

ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తున్నాను".
ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి