ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి
చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు.
"లెజెండరీ నిర్మాత ఆర్.బి. చౌదరి గారి ఆకస్మిక దుర్మరణం మనసుని కలిచివేసింది.
ఆయనతో నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. నా చిత్రం “గాడ్ ఫాదర్” కోసం సూపర్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా ఆయనతో పని చేసే అవకాశం దక్కింది.
ఆర్.బి. చౌదరి గారు ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, నటుల కెరీర్‌లను తీర్చిదిద్దుతూ, అనేక అద్భుత కథలను తెరపైకి తీసుకొచ్చిన గొప్ప నిర్మాత.
భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు వర్ణనాతీతం.
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తున్నాను".