'పెద్ది' కథ విన్న తర్వాత 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయాను. అంతలా కదిలించింది. పెద్ది కోసం 70-80 పీరియడ్ ని రిక్రియేట్ చేశాం. ఈ సినిమా కోసం వేసిన సెట్స్ ని ఆడియన్స్ గుర్తించలేరు. అంత నేచురల్ గా వుంటాయి: ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-నా పదేళ్ల కెరీర్‌లో ఒక కథకి ఇంతలా ఎక్సైట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. డైరెక్టర్ గారు కథ చెప్పిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయాను. అంతలా కదిలించింది. కథలోనే ఇంత బలం ఉంది కాబట్టి ప్రొడక్షన్ డిజైన్ పరంగా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను.
ఇది పీరియడ్ డ్రామా కదా.. సెట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ఆడియన్స్‌కి సెట్ అని తెలియకపోవాలి. అప్పుడే ఒక ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయినట్టు. నా వరకు ఈ సినిమాకి వేసిన సెట్స్‌ను ఆడియన్స్ అవి సెట్ అని గ్రహించలేరు. అంత నేచురల్‌గా ఉంటాయి.
-ఇది 70-80లలో జరిగే కథ. ఇదివరకే చాలా పీరియడ్ సినిమాలు చేశాను. ఆ అనుభవం నాకు ఉంది.
-‘పెద్ది’ విజయనగరం ఏరియాలో జరిగే కథ. అక్కడి వీధులు, క్లాక్ టవర్ ఇవన్నీ కూడా రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డిజైన్ చేశాం. అలాగే కుస్తీ, క్రికెట్ ఆటల విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఇందులో ఇప్పటివరకు ఎవరూ చూడని కుస్తీ సెటప్ చేశాం. దానికోసం అండర్‌గ్రౌండ్ సెటప్‌లో షూట్ చేశాం. చరణ్ గారు గదతో కనిపించిన షాట్ అక్కడే చేశాం.
డీవోపీ రత్నవేలు గురించి?
డీవోపీకి, ఆర్ట్ డైరెక్టర్‌కి ఒక సింక్‌లో ఉంటే సినిమా ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందులో అలాంటి మంచి సింక్ కుదిరింది. రత్నవేలు గారితో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మంచి కోఆర్డినేషన్‌తో వర్క్ చేశాం.
ఇందులో క్రికెట్ ఉంది కదా.. ‘లగాన్’ లాగా ఉంటుందా?
లేదండి. ‘లగాన్’ బ్రిటిష్ కాలంలో జరిగిన కథ. ఇది 70-80 మధ్యలో విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మన ఊర్లో పొలాల గట్ల మీద కూర్చుని క్రికెట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అంత నేచురల్ ఫీలింగ్ క్యారీ అవుతుంది.
-ఈ సినిమాకి ఏడాదికిపైగానే ప్రీ ప్రొడక్షన్ చేశాం. ఆ సమయంలోనే ప్రతి సెట్‌కు సంబంధించిన మినియేచర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఈ సినిమాకి వేసిన ప్రతి సెట్‌ను కూడా ఓపెన్ గ్రౌండ్‌లోనే వేశాం. నేచురల్ లైట్‌లోనే తీశాం.
-ఇందులో ఒక హిల్ స్టేషన్ ఊరు కావాలి. అది హైదరాబాద్‌లోని ఒక బూత్ బంగ్లాలో వేశాం. మీరు సినిమా చూస్తున్నప్పుడు అది ఒక కొండ కింద ఉన్న ఊరిలా అనిపిస్తుంది. ఆ సెట్ వేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.
-డైరెక్టర్ బుచ్చిబాబు గారు, నేను చాలా మంచి కోఆర్డినేషన్‌తో వర్క్ చేశాం. ఇందులో చెరుకు ఫ్యాక్టరీ ఉంటుంది. అది కూడా సెట్. కాకపోతే అందులో బ్యూటీ ఏంటంటే మీరు ఒక్కటీ కూడా సెట్ అని పసిగట్టలేరు.
‘పెద్ది’ కోసం ఎన్ని సెట్లు వేశారు?
-స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60-70 పైగానే ఉంటాయి. చిన్న సినిమా అయితే మనం ఎక్కడికైనా వెళ్లి షూట్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌తో వెళ్లి షూట్ చేయడం మామూలు విషయం కాదు. లోకేషన్స్ మన కంఫర్ట్‌లో పెట్టుకుంటేనే షూట్ చేయగలుగుతాం. విజయనగరం సెట్ వేసి దాదాపు ఏడాది అవుతుంది. ఎప్పుడు కావాలిస్తే అప్పుడు షూట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అన్ని వెదర్ కండిషన్స్‌కు అనుకూలంగా ఉండేలాగే ఆ సెట్ వేసాం.
-ఇందులో హీరో గారు వాడే బ్యాట్ కూడా చాలా నేచురల్ ప్రొడక్షన్ డిజైన్ నుంచి వచ్చింది. ఒక దేశీ ఆటగాడు తనకు దొరికే ముడిసరుకులతో బ్యాట్‌ని ఎలా తయారు చేసుకుంటాడో ఆ బ్యాట్ కూడా అంతే నేచురల్‌గా ఉంటుంది. అలాగే తనకు ఒక మేనరిజం ఉంటుంది. అవన్నీ కూడా అందులో రూపొందించడం జరిగింది.
చరణ్ గారితో మీ బాండింగ్ గురించి?
-నేను వేసిన ప్రతి సెట్‌ని చరణ్ గారు అప్రిషియేట్ చేశారు. ట్రైన్ సెటప్, స్పెషల్ సాంగ్ సెట్, కుస్తీ... ఇలా ప్రతి సెట్ ఆయనకి చాలా నచ్చాయి. చరణ్ గారిని కలవడానికి వచ్చిన చాలామంది కూడా సెట్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయని చెప్పారు.
చరణ్ గారికి గాయం ఎలా అయింది?
యాక్షన్ సీక్వెన్స్‌లో కుస్తీ సమయంలో అయింది. అలాంటి కండీషన్‌లో కూడా చరణ్ గారు వెంటనే మళ్లీ షూటింగ్‌లోకి వచ్చారు. ఎందుకంటే ఆ నెల షూట్ చేయకపోతే ఆర్టిస్ట్ డేట్స్ అన్నీ మిస్ అయిపోతాయి. అందుకే మళ్లీ వెంటనే వచ్చి చేశారు.
‘పెద్ది’ కథ గురించి?
ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ‘పెద్ది’ జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారు. కచ్చితంగా ఆ ఎమోషన్ అయితే ఉంటుంది.
-సుకుమార్ గారు మొన్న ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ‘రంగస్థలం’కి మించి ఉంటుందని అన్నారు. దానికి కారణం ఈ కథలో అంత బలం ఉంది.
మీ నుంచి కొత్తగా రాబోతున్న సినిమాలు?
‘పారడైజ్’, అలాగే చిరంజీవి గారి సినిమా