‘గోదారి గట్టుపైన’ లాంటి మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరూ ఫ్యామిలీస్‌తో
‘గోదారి గట్టుపైన’ లాంటి మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరూ ఫ్యామిలీస్‌తో కలిసి థియేటర్స్‌లో చూడండి. ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ ప్రభాస్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్ యూ. లైలా మేడమ్ గారు ఎప్పుడు సెట్లోకి వచ్చినా వెయ్యి స్మైల్ ఎమోజీలు సెట్లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా పాజిటివ్‌గా ఉంటారు. దర్శకుడు సుభాష్ చంద్ర ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. తనకి హ్యూమన్ ఎమోషన్స్, వాల్యూస్ బాగా తెలుసు. వాటినే అంత అద్భుతంగా సినిమాలోకి ట్రాన్స్‌లేట్ చేశాడు. ఈ సినిమా చూశాక మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా చూసిఎన్ని రోజులు అయిందో అనిపించింది. ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. సినిమా చూశాక తండ్రి - కూతుళ్ల ఎమోషన్ ఇంత బాగుంటుందా అనిపించింది. ఈ సినిమాకి అదే హార్ట్. జగపతిబాబు గారిని ఆ క్యారెక్టర్‌లో చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఒక తండ్రి తన కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్ ఆలోచిస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి అమ్మాయి “ఐ లవ్ యూ డాడీ” అని తమ ఫాదర్‌కి ఫోన్ చేసి చెప్తారు. అలాంటి అందమైన భావోద్వేగం ఈ సినిమాలో ఉంది. ఈ సమ్మర్‌లో మే 8న ఈ సినిమాను మీరందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను. మీ మూడ్ కూల్‌గా ఉండడానికి ‘గోదారి గట్టుపైన’ సినిమా మే 8న వస్తోంది. అందరూ ఫ్యామిలీతో కలిసి, ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సినిమాను చూడండి. మీ డాడీకి “ఐ లవ్ యూ” చెప్పండి. అది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. మీ దగ్గర్లో ఉన్న థియేటర్స్‌లో చూడండి. మీ రెస్పాన్స్ నాకు సూపర్ బూస్ట్ ఇస్తుంది. నిర్మాత అభినవ్ గారికి, నటీనటులకు, టెక్నీషియన్స్‌కి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్.

డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను, నా ఫ్రెండ్ ధీరజ్ కలిసి ఎంఆర్ ప్రొడక్షన్స్ స్థాపించాము. అందులో 100కు పైగా షార్ట్ ఫిలిమ్స్ తీశాము. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణం నా స్నేహితుడు ధీరజ్ రాజు. తనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే నా ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ‘గోదారి గట్టుపైన’ సినిమా మా బాబాయ్ గారి నుంచి స్ఫూర్తి పొందింది. ఆయన 2017లో చనిపోయారు. ఆయన కూతురిని ఎక్కువగా ప్రేమించే తండ్రి. ఆయన క్యారెక్టర్ నే జగపతిబాబు గారికి ఇచ్చాము. పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాగ వంశీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే లిరిక్ రైటర్స్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కి పేరుపేరునా ధన్యవాదాలు. షూటింగ్‌లో సహకరించిన అందరికీ థాంక్యూ. నా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యూ. ఇది ఒక మంచి సినిమాటిక్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. అందరూ కూడా థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. లాస్య, శ్రీవాణి గారు, రేణు అందరూ అద్భుతంగా చేశారు. హర్షవర్ధన్ గారు, రాజీవ్ కనకాల గారు, దేవి ప్రసాద్ గారు ఇలా ఎంతోమంది అనుభవం ఉన్న నటులు నన్ను ఎంతగానో ప్రోత్సహించి కంఫర్ట్ జోన్ ఇచ్చారు. లైలా గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్‌ని. లైలా గారు, జగపతిబాబు గారి కాంబినేషన్ చాలా హుందాగా ఉంటుంది. జగపతిబాబు గారితో పని చేయడం చాలా అరుదుగా వచ్చే అవకాశం. ఆ అవకాశం ఇచ్చిన జగపతిబాబు గారికి థాంక్యూ. ఈ విషయంలో సునీల్ నారంగ్ గారికి, జాన్వీ నారంగ్ గారికి కూడా థాంక్యూ. ఆ క్యారెక్టర్‌కు జగపతిబాబు గారు అయితే బాగుంటారని వాళ్లే సజెస్ట్ చేశారు. జగపతిబాబు గారి సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిధి ప్రదీప్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసింది. సుమంత్ ప్రభాస్ ఈ కథ విన్నాక “నేను మీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా ప్రజెంట్ చేయండి” అని చెప్పారు. తను ప్రమోషన్స్‌తో సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. తన భవిష్యత్తులో చాలా పెద్ద నటుడు అవుతాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమంత్‌కి థాంక్యూ. ఇప్పుడే ఫస్ట్ కాపీ చూసి వచ్చాను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్. నా ఫస్ట్ సినిమా, సుమంత్ సెకండ్ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని నేను గర్వంగా చెప్తున్నాను. నిర్మాత అభినవ్ గారు నాకు పునర్జన్మనిచ్చారు. ఆయనకీ ఎప్పటికీ రుణపడి వుంటాను.

నిర్మాత అభినవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాం. థియేటర్స్‌లో చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది కేవలం థియేటర్స్ కోసం తీసిన సినిమా. ఇది టీవీలో చూసే సినిమా కాదు, ఖచ్చితంగా థియేటర్స్‌లో చూసే సినిమా. ఈ సమ్మర్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో చాలా బాగుంటుంది. సుమంత్ సుభాస్ ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాంటి వాళ్లతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. వాళ్లు పడిన కష్టానికి కచ్చితంగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. నాకు ఎంతో సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ థాంక్యూ. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి. అందరూ మంచి థియేటర్స్‌లో చూడండి. కచ్చితంగా సినిమాను మీరు ప్రేమిస్తారు.

హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. మాయ క్యారెక్టర్ చేయడం మర్చిపోలేను. లైలా గారితో పనిచేయడం చాలా స్పెషల్ ఎక్స్‌పీరియన్స్. సుమంత్ ప్రభాస్ గారి సినిమాతో డెబ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. వారి నుంచి చాలా చిన్న చిన్న విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా మా అందరికీ ఒక కలల ప్రపంచం లాంటిది. మే 8న అందరూ కూడా ఈ సినిమా చూసి ఈ సమ్మర్‌లో మీ మూడ్‌ని కూల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.

లైలా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నన్ను మళ్లీ తెలుగు సినిమాలోకి తీసుకొచ్చిన దర్శకుడు సుభాష్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో నేను కచ్చితంగా నటించాలని ఆయన కోరారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో చాలా మంచి టీమ్‌తో కలిసి పని చేశాను. నిధి చాలా హార్డ్ వర్క్ చేసింది. ఆమె మరెన్నో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సుమంత్ ప్రభాస్ చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నిర్మాత అభినవ్ గారికి కంగ్రాట్యులేషన్స్. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మే 8న అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

రీణు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను సెకండ్ లీడ్ గా చేశాను. గోదారి గట్టు పైన నాకు చాలా స్పెషల్ ఫిలిం. చాలా మంచి టీం తో కలిసి పని చేశాను. సుమంత్ గారు రియల్లీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఆఫ్ స్క్రీన్ చాలా మ్యాజిక్ చేశారు. జగపతిబాబు గారితో కలిసి నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. లైలా గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా యాక్టింగ్ కెరీర్ కి మా డైరెక్టర్ ప్రాణం పోశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా ఎవరికైనా చాలా స్పెషల్. అభినవ్ గారు చాలా మంచి సినిమా నిర్మించారు. సుభాష్ చాలా మంచి సినిమా తీశాడు. ఈ సినిమా కథ విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. తప్పకుండా ఆడియన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ.

సుదర్శన్ మాట్లాడుతూ.. సినిమాను చాలా వినూత్నంగా ప్రచారం చేసాం. ఫైనల్‌గా మే 8న మీ ముందుకు వస్తుంది. 7వ తేదీన ప్రీమియర్స్ ఉంటాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అభినవ్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తీశారు. ఆయనలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమా చాలా కాలం మీ అందరికీ గుర్తుండిపోతుంది.

కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాట్లాడుతూ.. సుమంత్ ప్రభాస్‌తో వర్క్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. తను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఏం చెప్పినా ఎంతో డెడికేషన్‌తో చేస్తాడు. తన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. తన కష్టాన్ని అందరూ ప్రశంసిస్తారు. పాటలు మీ అందరికీ చాలా బాగా నచ్చాయి. కచ్చితంగా ఈ సినిమాను మీరందరూ ఎంజాయ్ చేస్తారు.

మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ మాట్లాడుతూ.. సుభాష్ గారితో షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అభినవ్ గారు సినిమాకి ఏం కావాలో అది ఎక్కడా రాజీ పడకుండా సమకూర్చారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ, నటీనటులందరికీ థాంక్యూ.

డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ.. ఈ వేడుక చాలా ఆహ్లాదకరంగా ఉంది. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. సుభాస్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఈ టీమ్ తెలుసు. అందరూ కలిసి ఎదుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ఈ హాట్ సమ్మర్‌లో ఇది ఒక కూల్ బ్రీజ్‌లాంటి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో చాలా మంచి నటీనటులు ఉన్నారు. సుమంత్ ప్రభాస్ ని చూస్తుంటే ఈశ్వర్ లో ప్రభాస్ గుర్తుకువస్తున్నారు. ట్రైలర్‌లో చూసినట్టే క్యారెక్టర్స్ అన్నీ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఏషియన్ సినిమాస్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకి చాలా మంచి రిలీజ్ ఉంటుందని నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాలను అందరూ ప్రోత్సహిస్తే తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తప్పకుండా సినిమా గురించి పాజిటివ్ వర్డ్ స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఈ వేడుక చాలా ఆత్మీయంగా ఉంది. మంచి వేదిక ఏర్పాటు చేశారు. ‘గోదారి గట్టుపైన’ అనే పేరుతోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు ఈ టీమ్. దర్శకుడి వ్యక్తిత్వం నుంచి పుట్టిన కథ ఇది. తను చాలా క్లారిటీగా ఉంటాడు. ఈ సినిమాలో సందర్భాలు చాలా బాగున్నాయి. నాకు ఎంతో నచ్చాయి. మనసుకు దగ్గరగా తీసుకుని చాలా మంచి పాటలు రాశాను. ఇందులో రెండు మంచి పాటలు సమకూరాయి. నాగవంశీ మాధుర్య ప్రధానంగా పాటలు చేశారు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను.

లిరిక్ రైటర్ బాలాజీ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీతో నాకు మంచి పరిచయం ఉంది. సుభాష్ చాలా సున్నితమైన మనసు కలవాడు. చాలా గొప్ప సందర్భాన్ని చెప్పాడు. అందుకే ‘బంగారు బొమ్మ’లాంటి మంచి పాట వచ్చింది. ఈ సినిమా నిర్మాతలకు చాలా మంచి విజయాన్ని ఇచ్చి కాసుల వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుడు కూడా మరిన్ని విజయవంతమైన సినిమాలతో కొనసాగాలని ఆశిస్తున్నాను.

ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మేము ఎంతో ఇష్టపడి పనిచేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధులిక మాట్లాడుతూ.. డైరెక్టర్ సుభాష్ గారు నాకు 15 ఏళ్లుగా పరిచయం. నేను ఆయనను బ్రదర్‌లా భావిస్తాను. ఆయన జర్నీ అంతా నేను దగ్గరుండి చూశాను. ఈ మూమెంట్ కోసం గత 15 ఏళ్లుగా అందరం ఎదురుచూస్తున్నాం. నిర్మాత అభినవ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. అందరం కష్టపడి, ఇష్టపడి పని చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను.

ఎడిటర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుభాష్ గారికి థాంక్యూ. ఈ సినిమా చేసినందుకు చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే పాజిటివ్ ఎనర్జీ ప్రేక్షకులకు వస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి ఆలోచనలతో పాటు ఒక చిరునవ్వు కూడా తీసుకెళ్తారు.

డీవోపీ సాయి సంతోష్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. విజువల్స్‌కు తగ్గట్టుగా వంశీ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా చాలా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.

Write A Comment