పదహారేళ్ల వయసుకు మాతృక అయినా 16 వయతినిలే, ఎర్రగులాబీలు వంటి అనేక సినిమాలు తీసి కొత్త తరం నటులను సృష్టించిన వెటరన్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు…
ఆయన వయసు 84… కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు….
16 వయతినిలే ఆయన తొలి సినిమా…
భారతి రాజాగారి సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి సినిమా ఫీల్డ్ కి డైరెక్షన్ కోసం వచ్చిన మాట వాస్తవం …
పదహారేళ్ల వయసు ఒరిజినల్ గా ఈయనే తీశారు అని తెలుసుకున్న వెంటనే అభిమానినయ్యాను…
భారతి రాజా ఎన్నో ఎక్స్పేరిమెంట్స్ చేశారు… ఆరోజుల్లోనే సైకలాజికల్ థ్రిల్లర్స్ తీసి యువతను ఉర్రూతలూగించారు…
రజని కమల్ శ్రీదేవికి స్టార్డం ఇచ్చిన వారిలో ఈయనే ప్రథముడు…
6 జాతీయ అవార్డులు 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు 4 ఫిలింఫేర్ అవార్డులు ఇంకా ఎన్నో అవార్డులు ఆయనను సత్కరించుకున్నాయి.
భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సన్మానించింది
ఆయన మంచి నటుడు కూడా…
తూరుపువెళ్లే రైలు కి తమిళ మాతృక కూడా ఈయనే తీసారు… ఈయన కేవలం గ్రామీణ జీవితాలనే చిత్రీకరిస్తారు అనే అపవాదును చెరిపెయ్యడానికి ఎర్రగులాబీలు అనే సైకాలజికల్ థ్రిల్లర్ పూర్తి అర్బన్ లైఫ్ ని ప్రతిబింబిస్తూ తీశారు ఆ తర్వాత టిక్ టిక్ టిక్ తీసి యువతని ఉర్రూతలూగించారు…
నిలాల్గల్ - నీడలు అనే సినిమా తో ఈయన పరిణితి పైన అందరికీ అనుమానాలు పోయాయి … ఆత్మబంధువు తో సున్నితమైన మానసిక, మానవీయా కోణాలను కూడా అంతే ప్రతిభతో చిత్రించగలరు అనేది నిశ్చయం అయింది.
తెలుగులో డైరెక్టుగా సీతాకొక చిలకలు కొత్త జంటతో తీసి సృజనకు భాష భేదాలు ఎల్లలు కేవు అని నిరూపించుకున్నారు. దీనికి జాతీయ వుత్తమా చిత్రం అవార్డుతో పాటుగా 5 నందులు కూడా దక్కాయి.
ఆరాధన - చిరంజీవి, సుహాసిని, జమదగ్ని, కొత్తజీవితాలు, యువతరం పిలిచింది, ఈతరం ఇల్లాలు వంటివి ఆయన నేరుగా తెలుగులో డైరెక్టు చేసిన సూపర్హిట్ సినిమాలు ….
భానుమతి బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన సూపర్హిట్ సినిమా మంగమ్మగారి మనుమడు కి కథను అందించారు… అలాగే రాజశేఖర్ నటించిన పల్నాటి పౌరుషం సినిమాకి స్క్రీంప్లే అందించారు…
భారతీయ సినిమాకి పేరుప్రతిశలు తెచ్చిన దర్శకులలో ముందువరుసలో తప్పకుండా వుంటారు… భారతీరాజా సినిమాలు ఫిల్మ్ స్టూడెంట్స్ కి రీసెర్చ్ మెటీరియల్ అనడంలో సందేహం లేదు …
ముఖ్యంగా స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ టెక్సినికాలిటీస్ తప్పనిసరి పాఠాలు…
మేటి దర్శకులు తన మార్క్ ని వదిలి తరలి పోయారు….
శ్రద్ధాంజలి
సద్గతి ప్రాప్తిరస్తు
- ప్రియదర్శిని